Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
- కేదార్నాథ్ ఆలయంలో సారా అలీఖాన్ ప్రార్థనలు..
- హిందూ ఆలయం దర్శించడం పాపం అంటూ మౌలానా ఆగ్రహం..
- అల్లాహ్ క్షమాపణలు చెప్పాలని ఫత్వా జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం, ముస్లిం మతపెద్దలకు నచ్చడం లేదు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముస్లిం మతపెద్ద మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ సారా హిందూ ఆలయాన్ని సందర్శించడాన్ని తప్పుపట్టారు. ఇతర మతాల ఆచారాల్లో పాల్గొనడం షరియత్ ప్రకారం నిషిద్ధమని, సారా చేసిన పని ‘‘పాపం’’అని అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. మౌలానా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి విశ్వాసం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ఎంపికలు వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినవని సారాకు మద్దతుగా నిలుస్తున్నారు.
సారా అలీఖాన్ గత వారం ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. దర్శనం కోసం ఇతర భక్తులతో కలిసి క్యూలో నిలుచుని ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆమె చర్యలను తప్పుబట్టారు. సారా కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడంపై కొందరు యువ ముస్లింలు తనను ప్రశ్నించారని మౌలానా అన్నారు. ఒక ముస్లిం వ్యక్తి స్వచ్ఛందంగా మరో మతానికి చెందిన ప్రార్థనలు, ఆచారాల్లో పాల్గొంటే అది పాపమని, అల్లాహ్‌ను క్షమాపణ కోరాలని వ్యాఖ్యానించారు.
Also Read
- Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
- PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
- Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
- Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
ముస్లిం స్త్రీ, పురుషులు ఇతర మతాలకు చెందిన విశ్వాసంలో భాగస్వాములు కావడం, ప్రార్థనలు చేయడం, మతపరమైన ఆచారాలు పాటించడం షరియత్ ప్రకారం అనుమతించబడదని పేర్కొన్నారు. సారా ఆలయ దర్శనం కోసం క్యూలో నిలబడటం, పూజలో పాల్గొనడం వంటి చర్యల్ని ‘‘హరామ్’’ అని అన్నారు. సారా పశ్చాత్తాపం వ్యక్తం చేసి, అల్లాహ్‌ను క్షమాపణలు వేడుకోవాలని, అలా చేయకపోతే తీవ్రమైన పాపానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సారా అలీఖాన్ గత ఆలయ పర్యటనకు కూడా విమర్శలకు గురయ్యాయి. 2021 నవంబర్‌లో కేదార్నాథ్ ఆలయానికి వెళ్లిన సమయంలో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. 2023 జూన్‌లో హిందూ ఆలయాన్ని దర్శించుకోవడం తన వ్యక్తిగత ఎంపిక అని ఆమె సమర్థించుకున్నారు. సారా అలీఖాన్‌కు కేదార్‌నాథ్‌తో అనుబంధం ఉంది. ఆమె దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ‘కేదార్నాథ్’ సినిమాలో నటించింది. 2017లో దీని షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇదే సారాకు తొలి సినిమా.
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!