మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి జయకేతనం ఎగురవేసింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని ఉత్సాహంగా కనిపించింది. ప్రతిపక్ష కూటమిని మాత్రం ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. అంతేకాకుండా హెచ్చరిక గంటలు మోగించాయి.
ఇది కూడా చదవండి: Off The Record : మానేరు మీద వరుసగా కూలిపోతున్న చెక్ డ్యామ్లు..కూలిపోతున్నాయా? కూల్చేస్తున్నారా ?
స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతలు అప్రమత్తం అయ్యారు. త్వరలోనే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. శివసేన పార్టీ చీలి పోకముందు 25 సంవత్సరాలు పరిపాలించింది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ)కి చెందిన నేత సంజయ్ రౌత్.. రాహుల్‌గాంధీతో ఫోన్ సంభాషణ చేశారు. ఐక్యతగా ఎన్నికల్లో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: పవన్ ట్రాప్ లో పడకుండా వైసీపీ నాయకుల వ్యూహాత్మక జాగ్రత్తలు?
జనవరి 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే ఉమ్మడి వ్యూహాన్ని రచించాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్లాన్ చేస్తోంది. అధికార కూటమికి ఎదుర్కోవాలంటే సమిష్ట పోరాటమే మార్గం అని సంజయ్ రౌత్.. రాహుల్‌గాంధీకి చెప్పినట్లు సమాచారం. ముంబైలో ఏక్‌నాథ్‌షిండే వర్గాన్ని ఎదుర్కోవాలంటే.. కాంగ్రెస్ మద్దతు అవసరం అని ఉద్ధవ్ థాకరే వర్గం భావిస్తోంది. ఓ వైపు రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) తో సమన్వయం చేసుకోవడం.. ఇంకోవైపు కాంగ్రెస్‌తో పొత్తును కొనసాగించడం ప్రాథమిక వ్యూహాకంగా తెలుస్తోంది. అయితే సైద్ధాంతిక విభేదాల కారణంగా MNS తో వేదికను పంచుకోబోమని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పోరాటం సాధ్యమవుతుందా లేదా? అనేది తేలాల్సి ఉంది.