Kerala: కేరళలో సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడిని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టు పెట్టాడు. దీంతో ఇది వివాదాస్పదం కావడంతో ఆ పోస్టును డిలీట్ చేశాడు. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న పి బాలచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read Also: High Court: “అత్తమామలకు సేవ చేయడం భారత సంస్కృతి”.. భార్య ‘భరణం’ కోరిన కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు..
‘‘ రాముడు, లక్ష్మణుడికి సీతా పరోటా, మాంసం వడ్డించింది’’ అంటూ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలచంద్రన్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడంతో రామ భక్తులకు క్షమాపణలు చెప్పాడు, తన పోస్టును గురించి చింతిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ ఎవరినీ కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. నిమిషాల వ్యవధిలో నేను దానిని ఉపసంహరించుకున్నాను, కాబట్టి ఎవరూ దాని గురించి ఆందోళన చెందవద్దు. నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని కమ్యూనిస్టులు దెబ్బతీస్తున్నారని, బాలచంద్రన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.