Ram Charan: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మహావతార్ సినెమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన తొలి మైథలాజికల్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచే అద్భుత రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం రెండో వీకెండ్‌లో మరింత కలెక్షన్స్ రాబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో, సినిమా హాళ్ల వద్ద సందడి నెలకొంది. ఈ విజయం నేపథ్యంలో దర్శకుడు అశ్విన్ కుమార్ కూడా చిత్రానికి మరింత బజ్ తీసుకొచ్చే…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’ ఉనికి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. ‘‘ రాముడు పురాణాలకు చెందిన వ్యక్తి’’గా అభివర్ణించారు. రాముడు పాత్ర కల్పితం అని అర్థం వచ్చేలా మాట్లాడటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాడని, రాముడి వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్…
DMK Leader: శ్రీరాముడిపై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే నేత, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రెగుపతి మాట్లాడుతూ.. శ్రీరాముడు ‘‘ద్రావిడ నమూనాకు ఆద్యుడు’’ అని అన్నారు. సోమవారం కంబన్ కజగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాముడు సామాజిక న్యాయ పరిరక్షకుడు అని ఆయన అన్నారు.
Sonu Sood: యాక్టర్ సోనూ సూద్ దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. కస్టమర్ రొట్టేలపై ఉమ్మేస్తున్న యువకుడికి మద్దతు తెలిపినందుకు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను సోనూసూద్ ‘‘రాముడికి ఎంగిలి చేసిన పండ్లను తినిపించిన శబరి’’తో పోల్చడం మరింత వివాదాస్పదమైంది. ఈ వివాదం మొత్తం ‘‘కన్వర్ యాత్ర’’ రూల్స్‌తో మొదలైంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అధికారుల కన్వర్ యాత్ర మార్గాల్లోని ప్రతీ దుకాణదారుడు తన పేరు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.…
శ్రీరామనవమి పండుగ అనుసరించి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతా రాముల కళ్యాణం అంగరగవైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని. లకు అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం జరగనుంది. స్వామివారి కల్యాణానికి చూడడానికి ఇప్పటికే లక్షకి పైగా భక్తులు వచింతలు తెలుస్తోంది. ఆలయ చైర్మన్ గెస్ట్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేసారు అధికారులు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలకు అభిషేకము నిర్వహించారు…
Kerala: కేరళలో సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడిని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టు పెట్టాడు. దీంతో ఇది వివాదాస్పదం కావడంతో ఆ పోస్టును డిలీట్ చేశాడు. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న పి బాలచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Ayutthaya: హైందవం ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పడు ఇస్లామిక్ దేశాలుగా చెప్పబడుతున్న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా హిందూ మతానికి చెందిన ఆనవాళ్లు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇండోనేషియాలో ఇస్లాం మతస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా మంది హిందూ ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ పేరు ‘గరుడ’ అని పెట్టుకున్నారంటే, వారు ఎంతగా ఈ హిందూ జీవనశైలితో మమేకమయ్యారో తెలుసుకోవచ్చు.
అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.