కల్నల్ సోఫియా ఖురేషి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రముఖంగా వినిపించిన పేరు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేది. దీంతో ఆమె పేరు ప్రాచుర్యం పొందింది.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు.
Kerala: కేరళలో సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడిని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టు పెట్టాడు. దీంతో ఇది వివాదాస్పదం కావడంతో ఆ పోస్టును డిలీట్ చేశాడు. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న పి బాలచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
BR Ambedkar: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్‌బీవీఎస్ మణియన్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మణియన్ గతంలో తమిళనాడు వీహెచ్‌పీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.