ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో 12వ మ్యాచ్‌లో మార్చి 8 ( శనివారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. IPL 2023 ఆరవ మ్యాచ్‌లో CSK చెన్నైలో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. 12 పరుగుల తేడాతో టోర్నీలో ఖాతా తెరిచింది. మరోవైపు బెంగళూరులో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ టోర్నమెంట్‌లో మొదటి విజయం కోసం తహతహలాడుతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రోహిత్ సేనతో తలపడటానికి ముందే ముంబైకి చేరుకుంది. చెన్నై టీమ్ కు ఘన స్వాగతం లభించింది. భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ CSK ఆటగాళ్లు వాంఖడే స్టేడియంకు చేరుకున్నప్పుడు వారికి స్వాగతం పలికారు.
A pleasant surprise indeed, dear viewers ✨#TouchdownMumbai 💛🦁 @KrisSrikkanth @mvj888 pic.twitter.com/THGPzBg5Do
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2023
Read Also : Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం
చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ప్రియమైన వీక్షకులారా, నిజంగా ఆశ్చర్యం కలిగించింది అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది. క్రిస్ శ్రీకాంత్‌తో పాటు భారత మాజీ, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ జట్టు ఆటగాళ్లను కలవడం కనిపిస్తుంది. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ వంటి ఆటగాళ్లను విజయ్ కలిశాడు.
Read Also : Adipurush : ఆదిపురుష్ అప్ డేట్.. హనుమాన్ పోస్టర్ రిలీజ్
లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి పుంజుకుంది.. దీంతో వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఛాలెంజ్‌ను అధిగమించడానికి ఎదురుచూస్తారు. CSK బ్యాటింగ్ లైనప్ IPL 2023లో ఇప్పటి వరకు బాగానే ఉంది మరియు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు మ్యాచ్‌ల్లో 149 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ధరించి అగ్రస్థానంలో ఉన్నాడు. టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు బౌలర్లు రాణించలేకపోయినందున CSK ఫ్రాంచైజీ మెరుగుపడాల్సిన ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. చెన్నైతో జరిగే పోరులో గెలిచి టోర్నీలో తమ ఖాతా తెరవాలని రోహిత్ సేన భావిస్తోంది.