పెళ్లై నాలుగు రోజులు కూడా కాలేదు.. అంతలోనే ఆ జంట అలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట కారు మప్పేడు సమీపానికి వచ్చేసరికి అరక్కోణం నుంచి వస్తున్నా ఒక సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి వారి కారును ఢీకొంది.
బలంగా లారీ ఢీకొనడంతో కారులో ఉన్న నవ దంపతులు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కొని ఉన్న మృతదేహాలను బయటికి తీశారు. పెళ్లి చేసుకొని కొత్త కోడలితో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా ఇంటికి వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
తాజావార్తలు
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!