Narayanpet Incident: విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్..
- నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
- మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత..
- 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమం- మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
- ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్- విచారణకు ఆదేశం..
- హెడ్ మాస్టర్ సస్పెండ్- మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayanpet Incident: నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత గురైన ఘటన సంచలనంగా మారింది. సమారు 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారందని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగింది అనే దానిపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
కాగా..ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మధ్యాహ్నం సాంబార్ గుడ్లతో కూడిన భోజనం చేసిన విద్యార్థులకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అపారమైన స్థితిలోకి వెళ్లడం..వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి తో బాధపడ్డారు. ఉపాధ్యాయులకు విషయం తెలపడంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Fake Ration Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!