Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
- ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం
- పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలలోని అలీపూర్‌లో 11 ఏళ్ల సురంజనా సింగ్ మృతదేహం అల్మారాలో వేలాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి తండ్రి, సవితి తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో నిత్యం తగాదాలు పడతారని.. శారీరకంగా.. మానసికంగా బాలికను నిత్యం వేధిస్తారని స్థానికులు వాపోయారు. దీంతో తండ్రి భోలా సింగ్, అతని భార్య పూజనే బాలికను చంపేశారంటూ స్థానికులు ఆగ్రహించి చితకబాదారు. సవతి తల్లి జుట్టు పట్టుకుని లాగి కొట్టగా.. తండ్రిని బూట్లతో కొట్టారు. పోలీసులు వెంటనే వచ్చి దంపతులను రక్షించారు. అనంతరం అలీపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతూనే ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కలిసి బాలికను చంపేశారని ఆరోపించారు. బాలిక సురంజనా సింగ్.. కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మేనకోడలు. దీంతో ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది.
Also Read
ఇది కూడా చదవండి: Tamilnadu Rain: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ
సురంజనా సింగ్.. ఐదో తరగతి చదువుతోంది. సవతి తల్లి పూజ దీపావళి రోజున సామాగ్రి కొనేందుకు బయటకు వెళ్లింది. ఇంటికొచ్చేటప్పటికీ సురంజనా సింగ్ మెడలో గుడ్డ ముక్కతో అల్మారాకు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చనిపోయినట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యగా తేలిందని పోలీసులు తెలిపారు. హత్యగా కూడా తోసిపుచ్చలేమని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో తెలుసా?
భోలా సింగ్ మొదట సంజయ్ రాయ్ అక్క బబితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సురంజనా సింగ్ జన్మించింది. అయితే కొన్నేళ్ల క్రితం బబిత ఆత్మహత్య చేసుకుంది. అనంతరం బబిత చెల్లెలు పూజను భోలా సింగ్ వివాహం చేసుకున్నాడు. అయితే తండ్రి, సవతి తల్లి నిత్యం సురంజనా సింగ్‌ను మానసికంగా.. శారీరకంగా వేధిస్తూనే ఉంటారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. నిత్యం బాలికను కొడతూనే ఉంటారని వెల్లడించారు. బాలిక అమ్మమ్మ మాట్లాడుతూ… బాలికను బెల్టులతో కొట్టారని.. ఏదో ఒక సాకుతో తలను తరచుగా గోడలకు కొట్టేవారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
సంజయ్ రాయ్.. 2024 ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చాడు. దీంతో ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. దేశ వ్యాప్తంగా మెడికోలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. చాలా రోజులు విధులు బహిష్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని.. వైద్యులకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడంతో విరమించారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
తాజావార్తలు
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?