కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఈ రోజు సీల్దా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని దోషిగా తేల్చింది. హత్య, అత్యాచారం సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. సోమవారం ఈ శిక్షలను విధించనుంది. గతేడాది ఆగస్టులో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలిపై పాశవికంగా హత్యాచారం జరిగింది.