Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు వాపుకు గురయ్యాయి లేదా బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి శ్వాస సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మధుమేహం లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ధూమపానం చేసేవారు, నిరంతరం కలుషితమైన గాలిని పీల్చేవారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతుందని సూచిస్తున్నారు. జలుబు లేదా ఫ్లూ వచ్చిన వ్యక్తికి కూడా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
READ ALSO: Naresh : నిర్మాతలు డబ్బులిస్తే సరిపోదు.. గౌరవం ఇవ్వాలి
అసలు కారణాలు ఏంటి?
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రావడానికి అనేక కారణాల ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల సమయంలో ఊపిరితిత్తులకు చేరే బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా బలహీనమైన రోగనిరోధక శక్తి, ధూమపానం చేసే వారికి, అలాగే దీర్ఘకాలిక దగ్గు లేదా గొంతు సమస్య ఉన్న వారు ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులు లేదా ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే శ్రద్ధ తీసుకోని వైద్యులను కలవడం చాలా ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు ఏమిటంటే?
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లక్షణాలు తేలికపాటివి లేదా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రారంభ లక్షణాలలో తరచుగా నిరంతర దగ్గు, తేలికపాటి జ్వరం, అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి, అధిక జ్వరం, ఎముక లేదా కండరాల నొప్పి, తుమ్ములు లేదా గొంతులో మంట వంటివి కూడా సంభవించవచ్చని చెబుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవడం, ముఖం నీలిరంగు లేదా పాలిపోవడం, నిరంతర అధిక జ్వరం వంటివి ఉంటాయని అన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఎందుకంటే ఇన్ఫెక్షన్ తీవ్రమవుతుందని, కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చని అంటున్నారు.
వీటిని ట్రై చేయండి..
1. ఈ సమస్య నుంచి బయటపడటానికి ముసుగు ధరించడం, కలుషితమైన లేదా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి.
2. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులు కడుక్కోవడం చేయాలి.
3. ధూమపానం, సిగరెట్లకు దూరంగా ఉండాలి.
4. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవాలి.
5. ఫ్లూ లేదా న్యుమోకాకల్ వ్యాక్సిన్ వంటి సమయానికి టీకాలు వేయించుకోవాలి.
6. ఇంట్లో, చుట్టుపక్కల గాలిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వెంటిలేషన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.
READ ALSO: Rare Earth Elements: చైనాకు చెక్ పెట్టిన భారత్.. కొత్త గేమ్‌లోకి ఇండియా ఎంట్రీ!