కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.