Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఏఏపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం నిర్ణయించింది.
Rajastan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరుగనున్నాయి. అంతకుముందే రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సీనియర్ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది.
జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నలుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది.
డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్‌క్వార్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.
రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం…