Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- రాయచూర్‌లో దారుణం
- రాళ్లతో కొట్టి మహిళ హత్య
- తల్లి మృతదేహంపై ఏడుస్తూ కనిపించిన చిన్నారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో 26 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కన్న తల్లి ఏ స్థితిలో ఉందో తెలియక.. పాపం.. పుణ్యం ఎరుగని రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ‘అమ్మా.. లే’ అంటూ ఏడుస్తూ కనిపించిన దృశ్యం స్థానిక రైతులను కలిచి వేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలు రాయచూర్‌కు చెందిన స్నేహగా పోలీసులు గుర్తించారు. సింధనూర్ తాలూకాలోని ఓ పొలంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మహిళ తల, శరీరంపై రాయితో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహకు నాలుగేళ్ల క్రితం అమిత్‌తో వివాహం జరిగింది. అయితే సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో నాలుగు నెలల నుంచి శుభమ్ అనే యువకుడితో స్నేహ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే స్నేహ హత్యకు గురైంది. అయితే చిన్నారి తల్లి శవంపై పడి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Also Read
- CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మృతురాలి భర్త అమిత్‌తో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి శుభమ్ ఉన్నాడు. స్నేహకు శుభమ్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రాయచూర్ ఎస్పీ అరుణాంశు గిరి తెలిపారు. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని.. అసలు ఏం జరిగింది? స్నేహను ఎవరు హత్య చేశారు? అనే విషయాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!