గుండెలను పిండేస్తున్న బాలిక సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..?

నిత్యం ఎక్కడో ఒకచోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన మగాళ్లు, మృగాళ్ళుగా మారి ఆడవారిపై అత్యచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా, పెద్ద.. వావివరుస అనే విచక్షణ మరిచి ప్రవరిస్తున్నారు. లైంగిక వేధింపులకు ఎంతోమంది చిన్నారులు బలవుతన్నారు. తాజాగా ఒక బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్నా ఆమె ఈ మృగాళ్ల మధ్య ఉండలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో కరూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కరూర్‌ జిల్లాలో ఇంటర్ చదువున్న ఒక బాలిక(17) శుక్రవారం సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చి గదిలోకి వెళ్ళింది. రాత్రి అవుతున్నా బాలిక తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్ కి ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. పక్కనే సూసైడ్ లెటర్ చదివిన తల్లిదండ్రులకు నోటా మాట రాలేదు ” మన జిల్లాలో లైగింక వేధింపులకు బలయ్యే చివరి అమ్మాయిని నేనే కావాలి.. నాకు బ్రతకాలని ఉంది.. చాలామందికి సేవ చేయాలని ఉంది.. కానీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బాధ ఉంది. వారి గురించి చెప్పే దైర్యం నాకు లేదు.. అమ్మానాన్నా నన్ను క్షమించండి త్వరగా ఏ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నా” అంటూ రాసింది. ఇక ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ లైంగిక వేధింపులు వలన ఎంతోమంది బాలికలు తమ కలలను నిజం చేసుకోలేకపోతున్నారు.. ప్రతి ఒక్క మహిళ బాధ ఇదే.. ఈ బాలిక ఆత్మహత్య ఎంతోమంది యువతుల ఆత్మఘోష.. ఈ లెటర్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles