Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- రాజస్థాన్‌లో ఘోర అమానుషo
- రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- గ్రామస్తులు ఆందోళన... సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ గురువు అత్యంత నీచానికి ఒడిగట్టింది. రూ. 500 నోటు కోసం అమ్మాయిల బట్టలు విప్పి సోదా చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలు అవమానంతో తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి చెందిన రూ.500 నోటు కనిపించలేదు. అయితే ఎవరి తీశారో చెప్పాలని హుకుం జారీ చేసింది. లేకపోతే బట్టలు విప్పాలని ఒత్తిడి చేసింది. సమాచారం ప్రకారం.. సీనియర్ టీచర్ సరస్వతి మీనా తరగతి గదిలో ఉంచిన రూ.500 నోటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె విద్యార్థినులపైనే అనుమానం వ్యక్తం చేశారు. రూ.500 తీసింది ఎవరో తెలుసుకోవడానికి విద్యార్థినులు బట్టలు విప్పాలని ఒత్తిడి చేసింది. అంతేకాకుండా ఎవరైనా బట్టలు విప్పేందుకు నిరాకరిస్తే వెంటనే రూ.500 చెల్లించాలని కూడా బెదిరించినట్లు బాధితులు తెలిపారు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సవాయ్ మాధోపూర్ జిల్లా విద్యాశాఖ అధికారి విషయాన్ని భరత్పూర్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన అధికారులు సీనియర్ టీచర్ సరస్వతి మీనాను తక్షణమే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను ధోల్పూర్ జిల్లా రాజాఖెడా చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో ఇతర ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందా అనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!