Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ 2026 అక్టోబర్ 15 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా బరిలో దిగుతున్న టాలీవుడ్ భారీ సినిమాల పోటీ కారణంగా, ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 లో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఈ మూవీ వస్తే తెలుగు సినిమాల నుంచి వచ్చే పోటీ తట్టుకుంటుందా అనేదే ఇప్పుడు సినీ వర్గాలలో కొత్త చర్చకు తెరలేపుతోంది.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఏకే 47’ కూడా అక్టోబర్ 16 తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, ఆ తేదీ వర్కౌట్ కాకపోతే అక్టోబర్ 16ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడే ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రజనీకాంత్ సినిమా అక్టోబర్ 15న విడుదలైతే, అక్టోబర్ 16న రెండు ప్రధాన తెలుగు సినిమాలు థియేటర్లలోకి రావడం పెద్ద పోటీకి దారితీయొచ్చు. ముఖ్యంగా రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్‌డమ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ‘జైలర్’ తెలుగు వెర్షన్‌కు వచ్చిన స్పందనతో పాటు రజనీ సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ కారణంగా సీక్వెల్‌కు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
అందుకే ‘జైలర్ 2’ అక్టోబర్ 15న వస్తే, మరుసటి రోజే భారీ తెలుగు సినిమాలను విడుదల చేయడం నిర్మాతలకు ఎంతవరకు లాభదాయకమనే ప్రశ్న తలెత్తుతోంది. థియేటర్ల సంఖ్య, షోలు వంటి అంశాల్లో మూడు సినిమాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో రాబోతున్న క్రేజీ యాక్షన్ డ్రామా కూడా ‘ఓమ్’ (Om) కూడా అక్టోబర్ 15నే పోటీకి దిగుతోంది. ఈ మూవీ కూడా ‘జైలర్ 2’కి తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, వెంకటేష్ ‘ఏకే 47’, ధనుష్ ‘ఓమ్’ వంటి భారీ చిత్రాలు ఒకే వారాంతం చుట్టూ పోటీ పడే పరిస్థితి వస్తే బాక్సాఫీస్ లెక్కలు మరింత ఆసక్తికరంగా మారతాయి. అయితే ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదలవుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో వచ్చే ప్రకటనలే ఈ బిగ్ క్లాష్‌పై పూర్తి స్పష్టత ఇవ్వనున్నాయి.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..