Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manisha Koirala: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె పగిలిపోతోందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి నేపాల్ ప్రజలకు, వరద బాధితులకు అవసరమైన ఆహారం, వైద్యం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చైనా, భారత్ నేపాల్ కు అండగా ఉండాలని, తాను కూడా వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో భాగస్వామిని అవుతున్నట్లు భావోద్వేగంగా తెలిపారు.
నేపాల్‌లో ప్రకృతి పెను విషాదం సృష్టించింది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు తన దేశంపై చూపిస్తున్న ప్రభావాన్ని చూసి భావోద్వేగానికి గురైన మనీషా కొయిరాలా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. నేపాల్‌కు భారత్, చైనాలు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఈ విపత్తు కారణంగా నేపాల్‌ను పర్యాటకులకు దూరం చేయవద్దని, దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఎంతో కీలకమని ఆమె గుర్తుచేశారు. ఆగస్టు 26న నేపాల్ భారీ వరదలు సంభవించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా రసువా, నువాకోట్, ధాదింగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విపత్తు తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఆగస్టు 30 నాటికి నేపాల్‌లో ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 781కు చేరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మరో 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న టిబెట్ ప్రాంతంలోనూ 16 మంది మరణించగా, వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ విపత్తులో పర్యాటకులు, తీర్థయాత్రికులు, విదేశీయులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. దీంతో నేపాల్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాఠ్మాండులో సద్గురు ఆధ్వర్యంలోని ఇషా ఫౌండేషన్ నిర్వహించిన ‘ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్’ కార్యక్రమంలో మనీషా కొయిరాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నేపాల్ పరిస్థితిపై మాట్లాడుతుండగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పదేపదే ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను ఆమె ప్రస్తావించారు. తన దేశం ఇలాంటి విషాదాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక వరదల అనంతరం నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు సహాయక సామగ్రి, రెస్క్యూ సిబ్బంది, ఇతర సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక బృందాలకు సవాలుగా మారాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేపాల్‌లో పుట్టి పెరిగిన మనీషా కొయిరాలాకు ఆ దేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఈ విపత్తుపై ఆమె స్పందన మరింత భావోద్వేగాన్ని కలిగించింది.
- Tags
- cinema
- Manisha Koirala
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!