God Father: ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్రల ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సత్యప్రియగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ ఈరోజు సత్యదేవ్ పాత్రను రివీల్ చేసింది. గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్ జైదేవ్‌గా కనిపించబోతున్నాడు. ఈ మేరకు సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సత్యదేవ్ డీసెంట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
గాడ్ ఫాదర్ మూవీని సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల ఈ మూవీ ఫైనల్ కాపీని చిరంజీవి వీక్షించినట్లు ప్రచారం జరుగుతోంది. తుది కాపీని చూసిన అనంతరం సినిమా అద్భుతంగా వచ్చిందని.. గ్రిప్పింగ్‌గా ఉందని దర్శకుడు మోహన్ రాజాను చిరంజీవి ప్రశంసించినట్లు తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ కాగా సత్యదేవ్, సునీల్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు.
'GODFATHER': SATYA DEV FIRST LOOK… Team #GodFather unveils #FirstLook of #SatyaDev from the film… Stars #Chiranjeevi, #SalmanKhan and #Nayanthara… Directed by #MohanRaja… [Wednesday] 5 Oct 2022 #Dussehra release. pic.twitter.com/tAnT9aEjdi
— taran adarsh (@taran_adarsh) September 12, 2022