Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయినప్పటికీ, ఇప్పటికీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ వీడటం లేదు. అయితే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశానికి ముందు రాహుల్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదే సమయంలో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ కేసీ వేణుగోపాల్ సీఎం కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమచారం. వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వెలిసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ల వెనక సతీషన్ అనుచరుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై రాహుల్ గాంధీ సతీషన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సతీషన్, కేసీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ గాంధీకి స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలపై ప్రభావం చూపుతూ, వర్గపోరును సృష్టించారని సతీషన్ ఆరోపించారు.
ఇదే కాకుండా కేరళ సీఎం రేసులో వీరిద్దరే కాకుండా రమేష్ చెన్నితాల పేరు కూడా వినిపిస్తోంది. కేసీ వేణుగోపాల్‌కు ఢిల్లీ నుంచి అధిష్టానం మద్దతు లభిస్తుంటే, సతీషన్‌కు స్థానికంగా ఉండే కేరళలో మద్దతు ఉంది. ముఖ్యంగా మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సతీషన్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకోగా, ఐయూఎంఎల్ 22 సీట్లు, కేరళ కాంగ్రెస్ 8 సీట్లు, ఆర్‌ఎస్‌పీ 3 స్థానాలు గెలిచాయి. మొత్తం యూడీఎఫ్ కూటమి 102 స్థానాలతో భారీ మెజారిటీ సాధించింది.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!