Home
Congress Kerala
Congress Kerala News
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
V.D. Satheesan: కేరళంలో దశాబ్దం కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.డి. సతీశన్ సోమవారం కేరళం 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. సతీశన్, 20 మంది సభ్యుల మంత్రిమండలితో పదవీ స్వీకార, రహస్య… -
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
Kerala: కేరళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పది రోజుల ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ వి.డి. సతీశన్ (VD Satheesan)ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) శ్రేణులు చేసిన సంబరాలు పెను వివాదానికి దారితీశాయి. ఇడుక్కి జిల్లాలో లీగ్ కార్యకర్తలు నిర్వహించిన విజయ యాత్రలో రెచ్చగొట్టే నినాదాలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. "లీగ్ పాలించే కేరళ గడ్డపై చట్టాలను నిర్ణయించేది కూడా… -
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
Kerala: కేరళలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. వీడీ సతీషన్‌ను గురువారం హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నతల మధ్య పదవి కోసం పోటీ ఉన్నప్పటికీ సతీషన్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే, సతీషన్ ఎంపికపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ను ‘‘ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఒత్తిడితోనే ఈ ఎంపిక జరిగిందని… -
Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయినప్పటికీ, ఇప్పటికీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ వీడటం లేదు. అయితే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశానికి ముందు రాహుల్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.… -
Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
Kerala Chief Minister: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాఫుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వైపే ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేరళ సీఎం అభ్యర్థి, ప్రభుత్వం ఏర్పాటును పరిశీలిస్తున్న పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు తమ నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేకు సమర్పించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజల అభిప్రాయాల ప్రకారం పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని వాస్నిక్, మాకెన్‌లు చెప్పారు. Read Also: Hantavirus Outbreak 2026:… -
Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
Kerala Congress: కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కేరళలోని మొత్తం 140 స్థానాలకు గానూ యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుంది. ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలు సాధించింది. ఈసారి కేరళ అసెంబ్లీకి బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ను కొత్త సమస్య వేధిస్తోంది. కాంగ్రెస్ అంటేనే… -
Shashi Tharoor: కేరళ సీఎంగా శశి థరూర్? ఫలితాలకు కొద్ది గంటల ముందు థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shashi Tharoor: కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు రాజకీయ వర్గాల్లో ఓ ప్రశ్న విపరీతంగా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వస్తే, శశి థరూర్ ముఖ్యమంత్రి అవుతారా? అందరిలో ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు థరూర్ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానా లేదా అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని తేల్చి చెప్పారు. తనను ఈ… -
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఓ శకం ముగియబోతోందా? కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేరళలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. అయితే అంతకు ముందే.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెద్ద మార్పు రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈసారి కేరళలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!