Rahul Gandhi: పాకిస్తాన్లో “రాహుల్ గాంధీ” ట్రెండింగ్.. కారణాలు ఏంటి..?
- పాకిస్తాన్లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..
- పాక్ మీడియా డిబేట్లో హాట్ టాపిక్‌గా ఆయన ట్వీట్స్..
- ఆపరేషన్ సిందూర్‌పై తమ అబద్ధాలకు మద్దతు దొరికిందని దాయాది సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం పాకిస్తాన్లో హీరోగా మారాడు, ముఖ్యంగా పాక్ మీడియా ఇటీవల రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని కోట్ చేస్తూ తెగ సంబరపడిపోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోని ట్వీట్ చేసి, ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే కాకుండా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది..? అని ప్రశ్నించారు. సైనిక చర్య గురించి ముందే పాకిస్తాన్‌కి సమాచారం ఇవ్వడం నేరం అని ఎక్స్‌లో అన్నారు.
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఫెయిల్ అయిందని, భారత్‌ని పాకిస్తాన్ ఓడించిందని చెబుతూ ఆ దేశం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. పాక్ ఆర్మీ భారత దాడుల్లో తన ఎయిర్ బేసులు ధ్వంసం అయినా, వైమానిక రక్షణ వ్యవస్థల్ని కోల్పోయినా కూడా ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కి చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని, ముఖ్యంగా రాఫెల్‌ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు, రాహుల్ గాంధీ కూడా ఎన్ని ఫైటర్ జెట్స్‌ని భారత్ కోల్పోయింది..? అని ప్రశ్నించడంతో పాక్ మీడియా పండగ చేసుకుంటోంది. పాకిస్తాన్ వాదనలకు బలం కూర్చేలా రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో ఆ దేశ మీడియా ప్రత్యేక డిబేట్లు నడుపుతోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా ప్రమోషన్..
అయితే, రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడుతూ, జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడని స్పష్టత ఇచ్చింది. ‘‘ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత మేము ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, పాక్ ఆర్మీకి చెప్పాము. అయితే వారు దీనికి దూరంగా ఉండాలని సూచించాము. అయితే, ఈ సలహాను వారు పాటించలేదు’’ అని జైశంకర్ చెప్పిన వీడియోని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు.
ఒక వేళ దాడుల గురించి పాకిస్తాన్‌కి ముందే తెలిసి ఉంటే, మురిడ్కే, బహవల్పూర్ వంటి ఉగ్రస్థావరాల్లో ఉగ్రవాదుల్ని ఉంచేవారా..?, ఆపరేషన్ సిందూర్‌లో 100 కన్నా ఎక్కువ ఉగ్రవాదులు మరణించే వారా..? అని పలువురు మాజీ సైనికాధికారులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ని హతమార్చిన తర్వాత అమెరికా పాకిస్తాన్‌కి సమాచారం అందించింది, 2019 బాలాకోట్ దాడుల తర్వాత కూడా మన డీజీఎంఓ దాడి వివరాలను పాకిస్తాన్‌కి అందించారని, ఇది సాధారణ విషయమే అని చెబుతున్నారు.
PAKISTANI MEDIA:
‼️CONGRESS HAS ADMITTED THAT OP SINDOOR FAILED
‼️CONGRESS HAS SAID SINDOOR KA SAUDA HUA
Rahul and Congress has done what DGISPR propaganda couldn't. They have fallen even lower than Pakistan's opposition pic.twitter.com/7QczQoi8Uc
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 20, 2025
Now the same has been picked up by Pakistani media. Shame on you @RahulGandhi https://t.co/LvWuEynWd2 pic.twitter.com/bVtU1B7lTD
— BALA (@erbmjha) May 19, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!