భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌లో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Trump: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలను ఆవిష్కరించిన ట్రంప్
భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు. నిఘా సంస్థలు, ఈడీ, సీబీఐలను ఆయుధాలుగా మారయని.. ఈ సంస్థల దగ్గర బీజేపీ నాయకులపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. రాజకీయ కేసుల్లో ఎక్కువ భాగంగా వారిని వ్యతిరేకించే వారిపైనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడని బెదిరించారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం అలర్ట్.. రాహుల్‌గాంధీతో కీలక చర్చలు
ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని… దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం తాము గెలిచామని చెప్పారు. భారతదేశంలో ఎన్నికల నిష్పాక్షపాతం జరిగేంత వరకు సమస్యలను లేవనెత్తుతుంటామని తెలిపారు. హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికలు సజావుగా జరగలేదని ఆరోపించారు. హర్యానా ఓటర్ల జాబితాల్లో నకిలీ ఎంట్రీలు సహా అక్రమాలపై ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు కోరామని.. కానీ స్పందన రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల యంత్రాంగంలో సమస్య ఉందని ప్రాథమికంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఐదు రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ జర్మనీ వెళ్లారు. పర్యటనలో భాగంగా బెర్లిన్‌లోని భారతీయ సమాజంతో ముచ్చటించారు. వైస్ ఛాన్సలర్ లార్స్ క్లింగ్‌బీల్, మాజీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌లతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. అలాగే BMW ఫ్యాక్టరీని సందర్శించారు.
#WATCH | Berlin, Germany | Lok Sabha LoP Rahul Gandhi says, "There is a wholesale capture of our institutional framework. Our intelligence agencies, ED and CBI have been weaponised. ED and CBI have zero cases against BJP and most of the political cases are against the people who… pic.twitter.com/ffaoEamAPI
— ANI (@ANI) December 22, 2025
#WATCH | Berlin, Germany | Addressing at Hertie School on "Politics Is The Art Of Listening", Lok Sabha LoP Rahul Gandhi says, "We have won elections in Telangana, Himachal Pradesh. We have been raising issues as far as the fairness of elections in India is concerned. I have done… pic.twitter.com/5mNIkcslXx
— ANI (@ANI) December 22, 2025
#WATCH | Berlin, Germany | Lok Sabha LoP Rahul Gandhi says, "A number of people in India support PM Modi. A lot of do not agree with his ideology and the vision of India that he has. We think the vision will fail and it has tremendous problems. It will create massive tensions in… pic.twitter.com/WXHve6aWS1
— ANI (@ANI) December 22, 2025