Lalu Family Trouble: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు..
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆర్జేడీ..
- ఆర్జేడీకి వరుస షాకులు ఇస్తున్న నితీష్ కుమార్ సర్కార్..
- రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్ యాదవ్ నివాస బంగ్లాలు ఖాళీ చేయాలని నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది. అయితే, లాలు సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. గత 20 ఏళ్లుగా లాలూ ఫ్యామిలీ ఈ భవనంలోనే ఉంటుంది. ఆర్జేడీ కార్యకలాపాలు, కీలక సమావేశాలు, మీడియా సమావేశాలు లాంటివి.. ఈ బంగ్లా నుంచే చేసేవారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, తాజా పరిణామాలపై లాలూ తనయ రోహిణి ఆచార్య స్పందించారు. నితీశ్ ప్రభుత్వం లాలూ కుటుంబాన్ని అవమానించడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తుందని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. బంగ్లా నుంచి బయటకు పంపినా.. బీహారీల గుండెల్లోంచి లాలూను బయటకు పంపించలేరని అన్నారు. ఈ క్రమంలో.. ఆయన హోదా, వయసుకైన ఈ ప్రభుత్వం గౌరవం ఇస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే, ఇది రబ్రీదేవితో పాటు లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా ఎం స్ట్రాండ్ రోడ్ బంగ్లా 26లోని భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులు అందజేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక, తాజాగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రి లకేంద్ర కుమార్ రోషన్‌కు ఆ బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తుంది.
Read Also: Smriti Mandhana-Palak: షాకింగ్ న్యూస్.. స్మృతి మంధానని మోసం చేసిన పలాశ్, స్క్రీన్షాట్లు వైరల్
ఇక, రాజకీయ పరాజయం, కుటుంబ అంతర్గత విభేదాలతో పాటు ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం.. లాలు కుటుంబాన్ని కుదిపేస్తుంది. ఆర్జేడీ నేతలు ఈ నోటీసుల వ్యవహారాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటున్నారు. బీజేపీ మాత్రం ఆ విమర్శలను తోసిపుచ్చుతున్నాయి. లాలూ ఫ్యామిలీ బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని.. తమ సర్కార్ ఆ పని చేసి తీరుతుందన్నారు. అయితే, అధికార వర్గాలు మాత్రం “రూల్స్ ప్రకారం” ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అధికారి శివ్‌రంజన్ మాట్లాడుతూ.. మాజీ సీఎం రబ్రీదేవి ప్రస్తుతం ఉన్న హోదా ప్రకారం ఇంకో కేటగిరీ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా హార్డింగ్ రోడ్‌లోని 39 నంబర్ సెంట్రల్ పూల్ భవనాన్ని ఆమెకు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె బీహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
Read Also: Liver Health Tips: లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలా..? ఔషధాలకు బదులు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాడు. వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పెట్టి పార్టీ పరువు తీశారని ఆర్జేడీ అధినేత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. సొంతంగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారాయన. ఈ క్రమంలో ఇప్పుడు అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అవమానాలు, సోదరుడు తేజస్వి యాదవ్‌తో విబేధాలు రావడంతో రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్‌బై చెప్పేసింది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!