Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.