Punjab: కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి నలుగురు మాజీ మంత్రులు
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు మంత్రులతో పాటు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. నలుగురు మాజీ మంత్రులతో సహా ఏడుగురు కాంగ్రెస్ నాయకులు శనివారం చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. మాజీ మంత్రులు రాజ్‌కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్‌ప్రీత్ సింగ్ కంగర్, సుందర్ శామ్ అరోరాలతో పాటు కాంగ్రెస్ నేతలు కేవల్ ఎస్ ధిల్లాన్, కమల్‌జీత్ ఎస్ ధిల్లాన్, మొహాలీలో కాంగ్రెస్ సిట్టింగ్ మేయర్ అమర్జీత్ ఎస్.సిద్ధూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు ఇద్దరు శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నేతలు బీబీ మొహిందర్ కౌర్ జోష్, సరూప్ చంద్ సింగ్లా కూడా ఈరోజు కమలం గూటికి చేరారు.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో కీలక నేత హర్ధిక్ పటేల్ ఇటీవల బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ ప్రముఖ నేతలు సునీల్ జాఖర్, ప్రమోద్ మధ్వరాజ్, అశ్విన్ కొత్వాల్ వంటి నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇక త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!