దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు.…