Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!
- పూరీ బీచ్ లో భారత రాష్ట్రపతి మార్నింగ్ వాక్..
- మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసిన రాష్ట్రపతి ముర్ము..
- స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని మానవజాతి దోపిడీ చేస్తోంది: ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరీకి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూరీ బీచ్‌లో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా.. జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే.. మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్విట్ట్ చేసింది. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం, ఇది ఒక ధ్యాన అనుభవం అని ద్రౌపది ముర్ము తెలిపారు.
Read Also: Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
కాగా, శ్రీ జగన్నాథ్‌ని దర్శనం చేసుకున్నప్పుడు, నేను ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను అని చెప్పారు. మన బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామన్నారు. మానవజాతి ప్రకృతిపై పట్టు సాధించింది.. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేస్తోంది.. దాని ఫలితం అందరూ చూడాల్సిందే అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
అయితే, ఈ వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన వేడి గాలులను ఎదుర్కొన్నాయి.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణంలో మార్పుల వల్ల విపరీతమైన అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాబోయే దశాబ్దాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది.. అలాగే, మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!