Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
- ఓవర్ సీస్ లో 16 మిలియన్ల డాలర్ల క్లబ్ లో కల్కి
- జవాన్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్
- నైజాంలో రూ. 150కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది.
మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్ మౌత్‌టాక్‌తో ఒక్కసారిగా పుంజుకుంది. కాగా బాలీవుడ్‌లో 11 రోజులకు గాను రూ. 200 కోట్ల గ్రాస్ సాధించి, ప్రభాస్ పేరిట మరోక రికార్డు నమోదు చేసింది. హిందీ సీమలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పయనిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోను డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.నైజాంలో నిన్నటితో ఈ చిత్రం రూ. 150కోట్ల గ్రాస్ ఫిగర్ ను అందుకుంది. నైజాంలో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టిన 3 సినిమాలు కలిగిన హీరోగా ప్రభాస్ పేరు నిలిచిపోతుంది. ఇప్పట్లో ఆ రికార్డును బద్దలు కొట్టగలిగే హీరో లేడనడంలో సందేహం లేదు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇదిలా ఉండగా నార్త్అమెరికాలో కల్కి ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. గడచిన వీకెండ్ తో ఈ చిత్రం $16M రాబట్టినట్లు అధికారకంగా వెల్లడించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ జవాన్ కలెక్షన్స్ ను దాటి, ఓవర్ సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ -5 చిత్రాల జాబితాలో కల్కి వచ్చి చేరింది. ఇంగ్లిష్ గడ్డపై కల్కి జోరు హీరో ఎవరు లేరు. విడుదల నాటి నుండి నేటి వరకు బుకింగ్స్ లో అదే జోరు కనిపిస్తోంది. కల్కి లాంగ్ రన్లో $20M క్లబ్ లో ఎంటర్ అవుతుందేమో చూడాలి…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?