ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: జగ్గారెడ్డికి కేటీఆర్ ప్రశంసలు.. ఎందుకంటే?
కాగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ లేకున్నా విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగలదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో విభేదాల కారణంగా జేడీయూ నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ కిషోర్‌ను.. భవిష్యత్‌లో బీహార్ సీఎంతో మాట్లాడతారా అని అడగ్గా… తాము మాట్లాడుతూనే ఉంటామని సమాధానం ఇచ్చారు. మరోవైపు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌తో మాత్రం మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు.