వరుస పరాజయాలు కాంగ్రెస్ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. కాంగ్రెస్ పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం సోనియా గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తుండగా… పార్టీలో సమూల సంస్కరణలు జరగాల్సిందేనని మరో వర్గం వాదిస్తోంది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఏమీ తేల్చలేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా ఉండాలని తాత్కాలికంగా తీర్మానించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మరికొందరు నేతలన్నారు. పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక… మరోసారి CWC మీటింగ్ జరగనుంది. ఇక బుధవారం నాడు…