Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్‌ను నిందితుడు ఎందుకు చంపాడంటే..!
- కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ హత్య కేసులో పురోగతి
- వ్యక్తిగత ఘర్షణలో స్నేహితుడే చంపాడని పోలీసుల వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝజ్జర్‌కు చెందిన సచిన్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Meenakshi Natarajan: దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
అయితే నిందితుడు సచిన్‌తో హిమాని నర్వాల్‌కు పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. సచిన్… ఝజ్జర్‌లో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. ఒక సంవత్సరం క్రితం ఆమెతో సచిన్‌కు పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా రోహ్తక్లోని విజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న హిమాని ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఫిబ్రవరి 27న రాత్రి 9 గంటల ప్రాంతంలో హిమానితో సచిన్ ఇంట్లోనే బస చేశాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రిషన్ కుమార్ రావు తెలిపారు. మరుసటి రోజు ఇద్దరి మధ్య ఒక విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. హిమాని చేతులను దుప్పిటితో కట్టేసి. మొబైల్ ఫోన్ ఛార్జర్‌తో గొంతుకోసి సచిన్ చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో భద్రపరిచాడు. ఇక ఆమె ఫోన్, ల్యాప్‌టాప్, ఆభరణాలు తీసుకెళ్లి దుకాణంలో దాచి పెట్టాడు. ఆమె స్కూటీలోనే తీసుకెళ్లి దాచిపెట్టాడు. అనంతరం ఆమె మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను ఆటోలో తీసుకెళ్లి సాంప్లా బస్టాండ్ దగ్గర విదిలేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..
ఇక హిమాని మృతదేహాన్ని దహనం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుమార్తెకు ఎవరితోనూ సన్నిహిత సంబంధాలు లేవని.. హత్యకు ఏదో బలమైన కారణం ఉందని బాధితురాలి తల్లి సవితా నర్వాల్ అనుమానం వ్యక్తం చేసింది. డబ్బు కోసమే.. స్నేహితుడు ఎలా చంపుతాడని ప్రశ్నించింది. పోలీసుల విచారణపై తమకు అనుమానం ఉందన్నారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Sonakshi : టాలీవుడ్లోకి మరో బాలీవుడ్ స్టార్ భామ
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!