Arvind Kejriwal: నా భార్య ‘‘ఝాన్సీ రాణి’’.. సునీతా కేజ్రీవాల్‌ని ప్రమోట్ చేస్తున్న ఆప్ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన భార్యను ప్రమోట్ చేసే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరుకున్న కేజ్రీవాల్‌ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది, దాదాపుగా 50 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, బెయిల్‌పై వచ్చిన ఆయన ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాను జైలుకు వెళ్లకూడదంటే తనకు ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నారు. అదే విధంగా “అచ్ఛే దిన్ ఆనే వాలే హై, మోడీ జీ జానే వాలే హై” అంటూ నినాదాలు చేస్తున్నారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఇదిలా ఉంటే మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉండటంతో తన భార్య సునీతా కేజ్రీవాల్‌ని ప్రమోట్ చేసే ఉద్దేశం కనిపిస్తోందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భార్య సునీతా కేజ్రీవాల్‌ని ప్రశంసించారు. ‘‘ఝాన్సీ కి రాణి’’ అంటూ అభివర్ణించారు. ‘‘ఈ రోజు నా భార్య వెంట ఉంది, నేను లేనప్పుడు ఆమె అన్నీ చూసుకుంది, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేది. ఆమె ద్వారా నా ఢిల్లీ వాసుల యోగక్షేమాలు తెలుసునేవాడిని, ఆమె నా సందేశాలు తీసుకువచ్చేది. ఆమె ఝాన్సీకి రాణి లాంటిది’’ అంటూ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు.
మీ ఆశీర్వాదం వల్లే నా భర్త ఈ రోజు మాతో ఉన్నారు, మంచి పనిచేసేవారికి దేవుడు సాయం చేస్తాడని, నా భార్య జైలుకు వెళ్లకూడదనుకుంటే మే 25న ఆప్‌కి ఓటేయండి అంటూ ప్రజల్ని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని కేజ్రీవాల్ మరోసారి హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడదని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం కారణంగా దేశం మొత్తం బీజేపీపై కోపంతో ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు జూన్ 25న ఆరో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!