Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Narendra Modi Speech At Independence Day Celebrations At Red Fort

PM Narendra Modi: ఆత్మ నిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదు..

Published Date :August 15, 2022 , 9:18 am
By Mahesh Jakki
PM Narendra Modi: ఆత్మ నిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Narendra Modi: భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర తమ ప్రాణాలను సైతం లెక్క చేయని బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్‌ అంటూ ప్రధాని ప్రసంగించారు.

ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారన్నారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎవరికీ తలవంచదని, ముందుకు వెళ్తూనే ఉంటుందని నొక్కి చెప్పారు. వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగిందని మోదీ పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత భావన గాయపడిందని చెప్పారు. ఆకలికేకల భారతం నేడు ఆహారధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందన్నారు. వైజ్ఞానికరంగంంలో భారత్‌ తనదైన ముద్ర వేస్తోందన్నారు. ఈ గౌరవం అకుంఠిత దీక్షతో పనిచేసిన ప్రతి పౌరుడికి దక్కుతుందని ప్రధాని మోడీ వివరించారు.

PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది

మన సైనికులకు ఎన్ని సార్లు వందనం చేసినా తక్కువేనన్నారు. మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోందని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. జై జై జవాన్‌, జైకిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ అంటూ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదన్న ప్రధాని మోడీ.. ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో బతకాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలును తగ్గిస్తూ.. మేకిన్ ఇండియాలో భారత్ దూసుకెళ్తోందన్నారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మనదేశంలోనే తయారవుతున్నాయన్నారు. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదన్నారు. ప్రపంచ అవసరాల్ని తీర్చే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని వివరించారు. మన పిల్లలు విదేశీ వస్తువులతో ఆడకూడదనే సంకల్పం తీసుకుందామన్నారు. ఎరువులు, విద్యుత్ అన్ని రంగాల్లో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోందని ప్రధాని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • azadi ka amrit mahostav
  • Independence Day
  • Independence Day celebrations
  • PM Modi
  • pm modi at redfort

తాజావార్తలు

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

  • AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!

  • KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions