Super Vasuki Train: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 15న అతి పెద్ద రైలును నడిపి భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. సాధారణంగా గూడ్స్ బండికే 100 అంతకంటే ఎక్కువ బోగీలు కనిపిస్తుంటాయి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంటే కొంతమంది సరదాగా బోగీలు లెక్కపెడుతుంటారు. అయితే ఆగస్టు 15న ఇండియన్ రైల్వేస్ నడిపిన రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో తెలిస్తే…
మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవేస్తారు.