Sweden: యూరప్ దేశాలకు ఏమైంది. సొంత దేశ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా కూడా, మానవ హక్కులు, శరణార్థి హక్కులు అంటూ వ్యవహరిస్తూ, నేరస్తుల్ని శిక్షించడం లేదు. శరణార్థులుగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల నుంచి యూరప్ దేశాలకు వచ్చిన వ్యక్తులు నేరాల్లో భాగస్వాములు అవుతున్నారు. బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఇలా పలు దేశాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, 16 ఏళ్ల అమ్మాయి అత్యాచార కేసులో స్వీడన్ కోర్టు ఇచ్చిన తీర్పును, ప్రపంచం…
Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్‌సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.
PM Modi: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా…
H-1B Visa: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్‌లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్‌కి మద్దతు తెలిపారు.
Elon Musk vs Trump: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తన టీమ్‌ని దాదాపుగా ఖరారు చేశారు. ట్రంప్ తన పాలనలో ఎలాన్ మస్క్‌తో పాటు భారతీ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి పెద్ద పీట వేశారు. అయితే, ఇప్పుడు ట్రంప్,