Farmers Killing: లఖింపూర్ ఖేరి ఘటన.. 4 నెలల తర్వాత మౌనం వీడిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… అయితే, తొలిసారి ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ… లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిన 4 నెలల తర్వాత మొదటి సారి రైతుల హత్యలపై వ్యాఖ్యానించారు.. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబర్ నుండి జైలులో ఉండగా.. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతడిని హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగిస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. అయితే, లఖింపూర్ ఖేరీ ఘటనపై మౌనం వీడిన ప్రధాని.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనం నిరసన తెలిపిన రైతులపైకి దూసుకెళ్లాడన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు.
Read Also: KTR: మోడీ క్షమాపణ చెప్పాల్సిందే..!
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఓటింగ్‌కు ఒక రోజు ముందు వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన ప్రధాని మోడీ.. చర్యలు, దర్యాప్తు నుండి బీజేపీ తన వాళ్లను రక్షించిందుకే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై స్పందించారు.. సుప్రీంకోర్టు ఏ కమిటీని కోరుకుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలిపిందని.. ఏ న్యాయమూర్తి విచారణకు సుప్రీంకోర్టు కోరుకుందో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోడీ.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద అక్టోబర్ 3న రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా.. రైతులపైకి దూసుకెళ్లింది ఓ కారు.. ఆ కారును ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. రెండ్రోజుల తర్వాత అతడిని అరెస్టు చేశారు… అయితే, దర్యాప్తులో నెమ్మదిగా సాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో, సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. రైతుల ఆగ్రహం, లఖింపూర్ ఖేరీ ఘటన ప్రభావం.. యూపీ ఎన్నికలలో బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషణలు ఉన్నాయి .. ముఖ్యంగా రైతులు గణనీయమైన ఓటింగ్ కలిగి ఉన్న పశ్చిమ ప్రాంతాలలో.. కొంత కోపాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం నవంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఢిల్లో సరిహద్దుల్లో సుదీర్ఘకాలం నిరసన తెలిపిన రైతులు కూడా తమ ఆందోళనను ముగించారు.. ఇక, రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!