Kartavya Path: నేడు “కర్తవ్యపథ్”ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కడానికి శిల్పులు 26,000 గంటలు పనిచేశారు. ఈ విగ్రహాన్ని నేడు మోదీ ఆవిష్కరించనున్నారు. 28 అడుగుల ఎత్తులో జెట్ బ్లాక్ గ్రానైట్ తో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఖమ్మం నుంచి ఈ గ్రానైట్ రాయిని తరలించారు. ఈ ఏకశిలా గ్రానైట్ ను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా 140 చక్రాల కలిగిన 100 అడుగుల ట్రక్కును ఏర్పాటు చేసి 1,665 కిలోమీటర్లు తరలించారు.
రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ రోజు కర్తవ్యపథ్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై ‘కర్తవ్య పథ్’గా వ్యవహరించనున్నారు. బ్రిటీస్ వారి హాయంలో ఈ మార్గాన్ని ‘కింగ్స్ వే’ పేరుతో పిలిచే వారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్ పథ్ గా మార్చారు. అయితే వలసపాలన, వలస చిహ్నాల పేర్లు మార్చాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ గా మారింది.
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
Read Also: Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమూహంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్ మార్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే సెంట్రల్ విస్టా నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో గత 20 నెలల నుంచి ఈ మార్గాన్ని ప్రజలకు అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చుట్టూ పార్కులు, గ్రానైట్ వాక్ వే, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. నిత్యం 24 గంటల పాటు హై సెక్యూరిటీ ఉంటుంది. దారిపొడవునా మొత్తం 16 వంతెనలు, రెండు చోట్ల బోటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,125 వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్ద గ్రీనరీ కనబడేలా గార్డెన్లను అభివృద్ధి చేశారు. అక్కడి ప్రతీ చెట్టు ఎత్తు, దాని రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్ చేశారు.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!