Congress: జూన్ 4 తర్వాత ప్రధాని మోడీకి లాంగ్ లీవ్.. జైరాం రమేష్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్‌కి వెళ్లాల్సి వస్తుందని, ఇది భారత ప్రజల హామీ అని అన్నారు.
Read Also: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
10 ఏళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 5 న్యాయ గ్యారెంటీలు భారత ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం చాలా అవసరమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలను ప్రకటించింది. రైతులకు మద్దతు ధర, కుల గణన, యువతకు ఉద్యోగాలు, నారీ న్యాయ్ పేరుతో ప్రతీ మహిళ ఖాతాలోకి రూ. 1 లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కార్మికులకు కనీస వేతనాల వంటి హామీలను ఇచ్చింది.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు భారతదేశ వ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఈ సారి బీజేపీకి సొంతగా 370 స్థానాలతో పాటు ఎన్డీయే కూటమికి 400కి పైగా సీట్లు వస్తాయని కమలం నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈసారి బీజేపీని గద్దె దించుతామని కాంగ్రెస్ చెబుతోంది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!