US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- భారత్‌లో అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Ambassador: భారత ప్రధాని నరేంద్రమోడీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే నేతల్లో మోడీ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో బలపడుతున్నాయని చెప్పారు. డిసెంబర్లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశం ఉందని, ఆయన ఈ సమావేశానికే పరిమితం కాదని, మోడీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ట్రంప్ మోడీని తన స్నేహితుడిగా భావిస్తారని అన్నారు.
ట్రంప్ వచ్చే ఏడాది భారత్‌కు మరోసారి వచ్చే అవకాశం ఉందని గోర్ సంకేతాలు ఇచ్చారు. తాను ట్రంప్‌తో మాట్లాడిన ప్రతీసారి 2020 భారత పర్యటన, మోడీని గుర్తుచేసుకుంటారని అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం అమెరికాకు మంచిదే అని గోర్ అన్నారు. దేశంలో స్థిరత్వం ఉండటం వల్ల భారత్ అమెరికాకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుతోందని చెప్పారు. భారత దేశానికి మోడీ స్థిరత్వాన్ని అందిస్తున్నారని గోర్ అన్నారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
భారత్ అమెరికాకు విశ్వసనీయమైన రక్షణ భాగస్వామి అని, ఇరు దేశాల రక్షణ సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలు, విక్రయాలకు మాత్రమే పరిమితం కాలేదని, అమెరికా ప్రపంచంలోని ప్రతీ దేశానికి ఆయుధాలను విక్రయించదని, అమెరికా విశ్వసించే దేశాల్లో భారత్ కూడా ఉందని చెప్పారు. జావెలిన్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్ల సరఫరాలను ఆయన ఉదాహరణలుగా చూపారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌లో మరోసారి భారత పర్యటనకు రానున్నారని గోర్ వెల్లడించారు. రూబియో భారత పర్యటనకు వచ్చిన కొన్ని నెలలకే మళ్లీ రావడం చాలా అరుదుగా ఆయన చెప్పారు. అమెరికా క్యాబినెట్ మంత్రుల పర్యటనలు కూడా ప్లాన్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలోని మూడు పెద్ద రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు రానున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలు, జీ20 సమావేశాలతో పాటు వచ్చే నాలుగు నెలల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మూడు సార్లు అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!