PM Modi: మే 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగి రష్యా ‘‘విక్టరీ డే’’ వేడులకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి బుధవారం రాయిటర్స్‌తో చెప్పారు. ప్రధాని మోడీ నిర్ణయం వెనక కారణాలను రష్యన్ అధికారులు పేర్కొననప్పటికీ, పహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Vladimir Putin : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మే 7న వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మే 9 న రష్యా విజయ దినోత్సవం సందర్భంగా, రెడ్ స్క్వేర్‌లో వేలాది మంది సైనికుల ముందు, పుతిన్ ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తన సైన్యాన్ని ప్రశంసించారు.