సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కొనసాగుతుంది. గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రధాని మోడీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి కావడం విశేషం. కొత్త రైళ్లు తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి.
ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
శనివారం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ఐసీఏఈ)ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ఇందులో ప్రదర్శించనున్నారు.
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇం�
ప్రధాని మోడీ బుధవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున ప్రయాణించే మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోడీ (PM Modi) ఈనెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని (First Hindu Temple) ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సిటీ పోలీస్ స్టాల్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయిన్ సీపీ విశ్వ ప్రసాద్, డీసీపీ సెంట్రల్ జోన్, డీసీపీ ట్రాఫిక్, ఎగ్జిబిషన్స్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్�