PM Modi: దేశమంటే ఢిల్లీ కాదు.. హైదరాబాద్, చెన్నై అంతా నాదే.. విభజన కుట్రల్ని సహించను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల దేశం వెనకబడి పోయిందని, గత 10 ఏళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ ని పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆరోపించారు.
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపినీ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. నా దేశం అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదని, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై అతా నాదే అని అన్నారు. ఇండియా అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదని జీ20 నేతలకు చాటి చెప్పామని అన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రాలు ఒక అడుగు మందుకేస్తే, తాను రెండు అడుగులు వేస్తానని, ఒక రాష్ట్రంలో సంక్షోభం వస్తే దాని ప్రభావం దేశంపై ఉంటుందని అన్నారు. కరోనా ముందు ప్రపంచం ఓడిన భారత్ గెలిచిందని ప్రధాని చెప్పారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతీ రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయని, నిధులు కేటాయింపును సంకుచితంగా చూడకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాలపై వివక్ష లేదని, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని తెలిపారు. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరమని, మా రాష్ట్రం, మా టాక్స్ అని అంటున్నారు, ఇదెక్కడి వితండవాదం..? అని ప్రశ్నించారు. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది, నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా..? అని ప్రశ్నించారు. మా రాష్ట్రంలోనే బొగ్గు ఉంది.. మేమే మాడుకుంటామంటే కుదురుతుందా..? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!