PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో అధికారం కోసం టీవీకేతో చేరిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. చిరకాల మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ వదిలేయడాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ‘‘పరాన్నజీవి’’గా, ‘‘వెన్నుపోటుదారు’’గా విమర్శించారు.

Read Also: Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!

‘‘ప్రస్తుతం తమిళనాడులోని పరిస్థితిని చూడండి. 25-30 ఏళ్లుగా కాంగ్రెస్, డీఎంకేతో సన్నిహిత సంబంధాలను పంచుకుంది. డీఎంకేతో పొత్తు ఎన్నోసార్లు కాంగ్రెస్‌ను సంక్షోభాల నుంచి గట్టెక్కించింది. 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించింది. కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన డీఎంకే, రాజకీయ పరిస్థితులు మారిన వెంటనే కాంగ్రెస్ చేతిలో ద్రోహానికి గురైంది’’ అని ప్రధాని అన్నారు.

అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ దొరికిన అవకాశంలోనే డీఎంకేకు వెన్నుపోటు పొడించిందని అన్నారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ మరో పార్టీలో జతకట్టిందని మోడీ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తీరుపై డీఎంకే కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అవకాశవాది అని, వెన్నుపోటు పొడించిందని డీఎంకే నేతలు విమర్శించారు. ఇకపై డీఎంకేకు కాంగ్రెస్ మిత్రపక్షం కాదని స్పష్టం చేశారు.