PM Modi security breach: ప్రధాని భద్రతా ఉల్లంఘన.. రెండేళ్ల తర్వాత పోలీస్ అధికారి సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi security breach: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన గతేడాది చర్చనీయాంశంగా మారింది. అత్యంత రక్షణ ఉండే ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పై ఆందోళనకారులు నిలిపేశారు. పంజాబ్ పోలీస్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భద్రతా ఉల్లంఘన జరిగనట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జనవరి 5, 2022 రోజున పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు మోడీ వెళ్లిన క్రమంలో, రైతులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.
Read Also: Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కు, అశ్వినికి ఇచ్చిపడేసిన నాగ్.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?
Also Read
ప్రధానికి సరైన భద్రతా కలిపించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత బటిండా సీనియర్ ఎస్పీ(ఎస్ఎస్పీ) గుర్బిందర్ సింగ్‌ని శనివారం సస్పెండ్ చేశారు.
ప్రధాని భద్రతా ఉల్లంఘన కేసులో భటిండా ఎస్ఎస్పీ గుర్బిందర్ సింగ్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భద్రతా ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం హోంశాఖ ఆదేశించినట్లు కేంద్ర డిప్యూటీ సెక్రటరీ అర్చనా వర్మా లేఖలో పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ మరియు అప్పీల్), రూల్స్, 1969 కింద క్రమశిక్షణా చర్యల సహా చట్టం కింద చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!