PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట..
- స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- తన స్థలాన్ని కబ్జా చేశారని ప్రధాని ఫిర్యాదు..
- మోడీని కలిసిన తర్వాత దిగివచ్చిన అధికారులు, ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఆయన చిన్ననాటి మిత్రుడు అస్గర్ అలీ వోరా కలిశారు. తన భూమిని కబ్జా చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయనను కోరారు. మహారాష్ట్రంలోని మీరా-భయందర్ భూ వివాదానికి సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానిని కలిసిన కొన్ని రోజులకే అస్గర్ అలీ వోరాకు సంబంధించిని వివాదాస్పద స్థలాన్ని వదిలుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మొహతా ప్రకటించారు.
అస్గర్, ప్రధాని మోడీలు కలిసి వడ్నగర్ బీఎన్ స్కూల్లో చదువుకున్నారు. సెప్టెంబర్ 08న ప్రధానిని కలిసి తన గోడు చెప్పారు. భయందర్ ఈస్ట్‌లోని తన భూమిని బిల్డర్లు ఆక్రమించారంటూ, ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. 1989లో నవ్ఘర్ ప్రాంతంలోని భూమిని కొనుగోలు చేసినట్లు వోరా చెప్పారు. తాను ఎవరికీ ఈ స్థలాన్ని విక్రయించలేదని, నకిలీ పత్రాలతో భూమిని రెండు భాగాలుగా విభజించి, ఇద్దరు బిల్డర్ కంపెనీలు ఆక్రమించినట్లు మోడీకి ఫిర్యాదు చేశారు.
Also Read
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
దీని తర్వాత, ఈ విషయాన్ని మీరా-భయందర్ మున్సిపల్ అధికారులు సుమోటోగా తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించారు. మంగళవారం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పర్దేశీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ వోరా, బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తం షిండే పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థలంపై యాజమాన్య హక్కుల్ని వదులుకుంటున్నట్లు మెహతా ప్రకటించారు. అలాగే వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!