PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
- కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
- ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలువడంపై ఆగ్రహం..
- నిజానికి కాంగ్రెస్ గ్రోత్ రేట్ అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఢిల్లీలో మిత్రపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని కొనియాడాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. భారతదేశంలో మందకొడి వృద్ధిరేటను ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలిచారని, అది వాస్తవానికి ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’ అంటూ దుయ్యబట్టారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సాహయ దుస్థితిలోకి నెట్టేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వం విముక్తి చేసిందని మోడీ చెప్పారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నుంచి దేశం విముక్తి పొందిందని, వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రజల్ని నమ్మించాలరని, చాలా తెలివిగా దానికి హిందూ గ్రోత్ రేట్ అని పిలిచారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడం మానేసి, దానిని దేశంలో మెజారిటీ వర్గంపై నిందలు వేసేలా హిందూ గ్రోత్ రేట్ అనే భావనను ప్రచారం చేశారని అన్నారు. పనితీరు, బాధ్యత, వైఫల్యాలు అన్నీ కాంగ్రెస్‌వే అని, కానీ అపవాదు మాత్రం దేశంలోని హిందూ జనాభాపై నెట్టారని అన్నారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రధాని అన్నారు. సరైన ఉద్దేశంతో పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని నిరూపించామని, దీనిని దేశ ప్రజలు చూశారని అన్నారు. ఎన్డీయే పనితీరుతో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని మోడీ తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే దానిని నిదర్శనమని చెప్పారు. ఈ విజయం వ్యక్తిగతం కాదని, ఎన్డీయే కుటుంబం మొత్తం సాధించిన విజయమని ప్రధాని అన్నారు.
అసలు ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అంటే ఏమిటి.?
‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్‌కృష్ణ 1978లో ఉపయోగించారు. స్వాతంత్య్రం తర్వాత 1950 నుంచి 1980ల వరకు భారత జీడీపీ వృద్ధిరేటు సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. అయితే, ఈ నెమ్మదైన వృద్ధిరేటనున సూచించడానికి ఈ పదాన్ని వాడారు. ‘‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’’ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదు అనే భావనను తీసుకువచ్చారు.
ఇప్పుడు ఈ పదమే వివాదానికి కారణమైంది. ఆర్థిక వృద్ధి నెమ్మదికి హిందువుల సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం ప్రభుత్వం విధానాలు, భారీగా ప్రభుత్వ నియంత్రణ, నిర్బంధ నియామాలు కారణమని ఆర్థికవేత్తలు ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికికి ఆపాదించడం అన్యాయమని చెప్పారు. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి ఈ ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనేది పాత పదంగా మారింది. అయితే, 2023లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’కు దగ్గరగా ఉందని అన్నారు. ఈయన వ్యాఖ్యలు అనేక మంది ఆర్థిక వేత్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ.. దీనిని తప్పుడు అంచనాగా, పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!