ప్రధాని మోడీ మణిపూర్ టూర్‌పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ విమర్శలు గుప్పించారు. జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించడం దురదృష్టకరం అన్నారు. ఇది ప్రధానుల సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. రెండు జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్‌పూర్ చేరుకున్నారు.