ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై అపహాస్యం.. టెక్సాస్ వర్సిటీ నుంచి విద్యార్థి బహిష్కరణ
ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బ తిన్నట్లుగా నిన్ననే ఒక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ వెల్లడించిందని తెలిపారు. భారతమాత భద్రతకు దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూర్‌ను తొలగించారని.. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. మన దళాలు.. పాకిస్థాన్ నడ్డి విరిచాయన్నారు. ఇది కొత్త భారతదేశం అని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఎవరి అణు బెదిరింపులకు భయపడేది లేదని మోడీ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Modi-Congress: కాంగ్రెస్‌కు హైకోర్టు షాక్.. మోడీ, ఆయన తల్లి వీడియో డిలీట్ చేయాలని ఆదేశం
ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లుగా జైష్ ఉగ్ర సంస్థ సోమవారం అంగీకరించింది. అంతేకాకుండా జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం కూడా హతమైనట్లు వెల్లడించింది. మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
చారిత్రాత్మక దినం..
ఇక ఈరోజు సెప్టెంబర్ 17 మరో చారిత్రాత్మక దినంగా మోడీ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కులాంటి దృఢ సంకల్పాన్ని చూపించారన్నారు. భారత సైన్యం హైదరాబాద్‌ను విముక్తి చేసి దాని హక్కులను కాపాడిందని గుర్తుచేశారు. దశాబ్దాలు గడిచినా ఎవరూ ఈ విజయాన్ని జరుపుకోలేదన్నారు. మన ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని అమరత్వంగా మార్చిందని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "… From September 22, the first day of Navratri, new GST reforms will be implemented. We have to take advantage of them by buying Indian products… Every shop should have a board that says, 'Garv se Kaho,… pic.twitter.com/IcS5vOXii5
— ANI (@ANI) September 17, 2025