PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
- రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ ప్రత్యేక భేటీ
- ఇంధన సంక్షోభంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కీలక దౌత్య సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.

Also Read
- Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
- RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ భేటీల్లో చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే బ్రిక్స్ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులతో కలిసి మోడీ అధికారిక ‘‘బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో’’లో కూడా పాల్గొన్నారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఎస్.జైశంకర్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారత్ మండపంలోకి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్కు స్వాగతం పలికారు. సభ్య దేశాలు, పరిశీలక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులను కూడా ఆయన ఆహ్వానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో ఉండటంతో.. ఆయన స్థానంలో భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహోంగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, ఇథియోపియా ప్రతినిధి గిడియాన్ తిమోతీ హెస్సన్లకు జైశంకర్ స్వాగతం పలికారు. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షహీన్ అల్ మరార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రపంచ, ప్రాంతీయ అంశాలు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక సంస్కరణలు, వాణిజ్యం, అభివృద్ధి సవాళ్లపై చర్చించేందుకు బ్రిక్స్ వేదికగా నిలుస్తోంది. 2026 బ్రిక్స్ చైర్మన్‌షిప్‌ను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మే 14 నుంచి 15 వరకు జరగనున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రెజిల్ నుంచి ఈ ఏడాది జనవరి 1న భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ బ్రిక్స్ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!